- కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు.
కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆనారోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్య తరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆదుకుంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తెలిపారు కోరుట్ల పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోనీ కోరుట్ల పట్టణ మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జువ్వాడి నర్సింగరావు లు విచ్చేసి 19 లక్షల 46 వేల 5 వందల రూపాయల విలువ గల 40 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి తో కలిసి పంపిణీ చేశారు. జువ్వాడి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్య తరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ బిసి సెల్ జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, పట్టణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజం, తదితరులు పాల్గొన్నారు.