Take a fresh look at your lifestyle.

నెంబర్ ప్లేట్స్, సరైన పత్రాలు లేని 316 వాహనాలు సీజ్

  • జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెంబర్ ప్లేట్స్ , సరైన పత్రాలు లేని 316 వాహనాలు సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి,కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక కాలంలో ముమ్మర తనిఖీ లు చేశామని, వాహనాల తనిఖీ చేయగా ఇందులో సరైన నెంబర్ ప్లేట్స్ లేని 316 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాటికి సరైన నెంబర్ ప్లేట్లను బిగించిన తర్వాత వాహనాలను విడిచి పెట్టడం జరిగిందని తెలిపారు.నిబందనలకు విరుద్దంగా , ఇష్టారీతిన వాహన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ తో పాటు తప్పుడు నంబర్ లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారని, ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్ష రాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయని, కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం చేస్తున్నారు. ఇలాంటి వారు వాహన తనిఖీల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిదిలోని ప్రజలు అందరు పోలీస్ లకు సహకరించి తమ వాహనాల నెంబర్ ప్లేట్స్ నిబందనల ప్రకారం బిగించు కోవాలని, లేని పక్షం లో వాహనాలపై నంబర్ లేకుండా, నిబందనలకు విరుద్దంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి వాహనం నడిపితే వాహనదారుడి పై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని సూచించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా ఈ తనిఖీలు నిరంతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.