-బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి
-బెస్ట్ యాక్టర్‌గా చైతన్య, హీరోయిన్ రష్మిక
-చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డ్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం 2025వ సంవత్సరానికి గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుతో పాటు సభ్యులు ఈ అవార్డులు అనౌన్స్ చేశారు. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ అనౌన్స్ చేశారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ CBFC ద్వారా సర్టిఫికెట్ పొందిన చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్‌కు ఈ అవార్డ్స్ ప్రకటించారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ నెల 19న అవార్డులు ప్రధానం చేయనున్నారు.
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ హీరోగా నాగ చైతన్య (తండేల్), హీరోయిన్‌గా రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్) నిలిచారు. స్పెషల్ జ్యూరీ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ అవార్డు వరించింది.
ఫీచర్ ఫిల్మ్స్
బెస్ట్ మూవీ – రాజు వెడ్స్ రాంబాయి
బెస్ట్ సెకండ్ మూవీ – దండోరా
బెస్ట్ థర్డ్ మూవీ – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
బెస్ట్ యాక్టర్ – నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్)
బెస్ట్ డైరెక్టర్ – సాయిలు కంపాటి (రాజు వెడ్స్ రాంబాయి)
బెస్ట్ డాక్యుమెంటరీ – యూనిటీ
బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ – సంక్రాంతికి వస్తున్నాం
బెస్ట్ చైల్డ్ మూవీ – అనగనగా
బెస్ట్ సోషల్ మెసేజ్ మూవీ – కోర్ట్
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ నేషనల్ ఇంటిగ్రేషన్ – తండేల్
ఉత్తమ సహాయ నటుడు – శివాజీ
ఉత్తమ సహాయ నటి – భూమిక (యుఫోరియా)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – మార్క్ రాబిన్ (దండోరా)
బెస్ట్ మేల్ సింగర్ – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
బెస్ట్ ఫీమేల్ సింగర్ – సాహితీ (కన్నప్ప)
బెస్ట్ లిరిసిస్ట్ – నంద కిశోర్ (కుబేర – పచ్చ పచ్చని చేలల్లో)
బెస్ట్ ఎడిటర్ – శ్రీకర ప్రసాద్ (మిరాయ్)
బెస్ట్ స్క్రీన్ ప్లే – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
బెస్ట్ స్టోరీ రైటర్ – గుణశేఖర్ (యుఫోరియా)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ – కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)
బెస్ట్ పర్యావరణ చిత్రం – ఇగ్వా
బెస్ట్ స్పెషల్ ఎఫెక్స్ట్ మూవీ – మిరాయ్
బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్ట్స్
బెస్ట్ కామెడీ యాక్టర్ – శ్రీకృష్ణ తేజ (జిగ్రిస్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్ – ఎం ఆర్ రాధాకృష్ణన్ (కిష్కింధపురి)
బెస్ట్ కొరియోగ్రాఫర్ – ఆట సందీప్ (గిర గిర గింగిరా గిరే – ఛాంపియన్)
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ – తోట తరణి (ఛాంపియన్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్ (అఖండ)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ (ఛాంపియన్)
బెస్ట్ స్పెషల్ జ్యూరీ మూవీ – 23
స్పెషల్ జ్యూరీ హీరో – రోషన్ (ఛాంపియన్)
స్పెషల్ జ్యూరీ అవార్డులు
ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – మెగాస్టార్ చిరంజీవి
సినారె అవార్డు – ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ
పైడి జయరాజ్ అవార్డ్ – యూనివర్సల్ హీరో కమల్ హాసన్
అక్కినేని నాగేశ్వరరావు అవార్డు – జయసుధ
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కైవసం చేసుకున్నారు.
బిఎన్ రెడ్డి అవార్డు – సింగీతం శ్రీనివాసరావు
కాంతారావు అవార్డు – ఆర్ నారాయణమూర్తి