- మాజీ డిప్యూటీ మేయర్ ఇబ్రామ్ శేఖర్
మహేశ్వరం, ముద్ర : బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బెల్టు షాపులు, గంజాయి నిర్మూలనకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, ముందుకు వచ్చి,ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు వాటి నిర్మూలనకు కృషి చేయాలని బిఎంసి మాజీ డిప్యూటీ మేయర్, బిఎస్పీ రాష్ట్ర నాయకులు ఇబ్రహీం శేఖర్ పిలుపు నిచ్చారు. మంగళ వారం ఏర్పాటు చేసిన సమావేశంలో శేఖర్ మాట్లాడుతూ..గ్రామాలు, బస్తీలు, కాలనీలు అనే తేడాలేకుండా పది ఇళ్లకు ఒకటిగా ఎక్కడ పడితే అక్కడ బెల్టు షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలు వైద్య సేవలు అనే విషయాన్ని విధంగా బెల్టు షాపులు ఉన్నాయన్నారు.దీంతో యువత మందు, గంజాయికి బానిసలుగా మారి వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగిన మైకంలో ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడంతో పాటు అత్యలు చేయడం వంటి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని అన్నారు. అందుకు నిదర్శనం నిన్న ఊరుకొండ గ్రామంలో ఒక మహిళపై ఎనిమిది మంది అత్యాచారానికి ఒడిగట్టడమేనన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు బెల్టు షాపులలో మద్యం లభిండమే కారణమన్నారు.సమాజ శ్రేయస్సును కోరే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి, బెల్టు షాపులు, గంజాయి నిర్మూలనకు ముందుకు రావాలని ఆయన పిలుపు నిచ్చారు.అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు,ప్రజా సంఘాలు బాలాపూర్ గ్రామముతో బాటు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల బెల్టు షాపులు, గంజాయి నిర్మూలనకు ఏకగ్రీవ తీర్మానం చేసి, వాటి నిర్మూలనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పౌర సమాజం కూడా ముందుకు వచ్చి, బెల్టు షాపులను అడ్డుకోవడంతో పాటు గంజాయి లేకుండా చూడాలని కోరారు.బెల్టు షాపులు నిర్వహించే వారు కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని బెల్టు షాపులు బందు చేయాలని సూచించారు.