Take a fresh look at your lifestyle.

మెదక్ పోలీస్ కు రెండు పెట్రోల్ బంకులు ఎస్పీ శ్రీనివా రావు

ముద్ర ప్రతినిధి మెదక్:
మెదక్ జిల్లా పోలీస్ శాఖకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు సంబంధించిన రెండు పెట్రోల్ బంకులు మంజూరయ్యాయని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు.
ఈ రెండు పెట్రోల్ బంకులు శంకరంపేట్.ఆర్ మండల కేంద్రంలో, మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
శంకరంపేట్ (ఆర్) మండల కేంద్రంలో మంజూరైన పెట్రోల్ బంకు నిర్మాణ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉండగా, ఆవుసులపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ రెండు పెట్రోల్ బంకులు పూర్తిగా పోలీస్ శాఖ ఆధీనంలో నిర్వహించబడతాయని, నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ మహేందర్, డియస్పిలు ప్రసన్న కుమార్, రంగనాథ్, సీఐలు జర్జ్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, ఆర్ఐ శైలందర్, రామకృష్ణ, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.