Take a fresh look at your lifestyle.

నేటి ధర్నాను విజయవంతం చేయాలి : జిల్లా జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి

 ముద్ర, ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

నేడు మండల, డివిజన్, జిల్లా స్థాయిలోని ఉద్యోగులు కార్యాలయాలలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ భగత్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లాలోని అన్ని ఉద్యోగ సంఘాలతో ( టీజీజాక్ ) సన్నాహక సమావేశమం స్థానిక జిల్లా ఐడిఓసి లో జరిగింది. ఈ సందర్బంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ( టీజీజాక్) రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2023 నుండి ఉద్యోగులకు రావాల్సిన రెండవ పిఆర్సిని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల 13 వేల కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులకు EHS ను వెంటనే అమలు చేయాలని, కొత్త పెన్షన్ విధానమును (సీపీస్ ) రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానమును (ఒపి ఎస్) ను యధావిధిగా అమలు చేయాలని అనే అంశంపై ఉద్యోగుల భోజన విరామ సమయంలో జరిగే ధర్నా కార్యక్రమమును జయప్రదం చేయాలన్నారు. .
ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు భగత్, పి ఆర్ టి యు అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, కార్యదర్శి యుటిఎఫ్ అధ్యక్షులు యాదయ్య, భువనగిరి జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షులు జగన్మోహన్ ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, ట్రస్సా అధ్యక్షులు కృష్ణ, టీఎన్జీవో నాయకులు శ్రీకాంత్, శశికాంత్, డి. టి.ఎఫ్ లక్ష్మీ నరసింహ, శైలజ, శ్రీనివాస్, డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి లింగయ్య, దుర్గాప్రసాద్, యుఐఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు నర్సిరెడ్డి సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.