ముద్ర, యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో ఆలయ అర్చకులు నిత్య ఆరాధనలు నిర్వహించారు. గురువారం స్వామివారి దర్శనానికి కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో జరిగే సువర్ణ పుష్పార్చన నిత్య కళ్యాణం వేద ఆశీర్వచనం సాయంత్రం జరిగిన వెండి మొక్కు జోడి సేవలు కొండకిందగల సత్యనారాయణ స్వామి వ్రతాలలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కొండపైన అనుబంధాలయమైన శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుని మొక్కు బడులు చెల్లించుకున్నారు. అనుబంధాలయమైన పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని సందర్శించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి నిత్య రాబడిలో భాగంగా గురువారం రోజున రూ.12,82,284,వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ప్రశాంత్ చార్యులు రామాచార్యులుఇన్చార్జి వెంకటేష్ ఎస్పీఎఫ్ సిబ్బంది మాణిక్ ప్రభు మోహన్ రెడ్డి పాండు సూర్య నాయక్, దేవస్థాన సిబ్బంది కుమార్ భక్తులు పాల్గొన్నారు.
భక్తునికి మొబైల్ ఫోన్ అప్పజెప్పిన సెక్యూరిటీ సిబ్బంది శేఖర్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి దర్శనార్థం వచ్చిన హైదరాబాద్ కు చెందిన మహేష్ దర్శనం వెళ్లే సమయంలో కొండపైన బస్ స్టాప్ లో తన మొబైల్ ఫోను మర్చిపోయాడు. కొండపైన బస్ స్టాప్ లో అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది శేఖర్ ఆ మొబైల్ ఫోను గమనించి మైక్ లో అనౌన్స్ చేపించి భక్తుని వివరాలు తెలుసుకొని భక్తునికి అప్పజెప్పాడు. భక్తునికి తన మొబైల్ ఫోను తిరిగి ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. అనంతరం శేఖర్ ను ఆలయ అధికారులు ఎస్విఎఫ్ అధికారులు తోటి సిబ్బంది భక్తులు పలువురు అభినందించారు.