* పలు రకాల శరీర బాగాల స్టాల్స్ ఏర్పాటు చేసిన మెడికో లో
* సందర్శించిన పాఠశాల విద్యార్థులు నిర్వాహకులు డా, సదానందం, డా దేశం
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ విద్యార్థులు మెడికల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఆరోగ్య దినోత్సవం థీమ్ టుగేదర్ ఫర్ హెల్త్. స్టాండ్ విత్ సైన్స్ అంటూ ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఉన్న మూడ నమ్మకాలను తొలగించేలా వైద్య విద్యార్థులు రకరకాల మోడల్స్ ఏర్పాటు చేసి అవగహన కల్పించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎంబిబిఎస్ వైద్య విద్యార్థులు 64 మోడల్స్ ఏర్పాటు చేశారు. మూడనమ్మకాలకు వ్యతిరేకంగా, సీపీఆర్, అవయవ దానం, మానవ శరీరంలోని అవయవాల పనితీరు, గ్రహణం సమయంలో గర్బిణీలు, చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర పలు రకాల ఆరోగ్య విషయాలపై వైద్య విద్యార్థులు అవగహన కల్పించారు. పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ప్రజలు ఎగ్జిబిషన్‌లోని స్టాళ్లను పరిశీలించారు.

గర్బిణీలు పండిన బొప్పాయి తినొచ్చు……
గర్బిణీలు బొప్పాయి తినకూడదనే అపోహ కొందరిలో ఉంది. బాగా పండిన బొప్పాయి తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే ఫైబర్, సి విటమిన్ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, సి ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చి బొప్పాయి కాయ తినడం వల్ల గర్బిణీలకు గర్బస్రావం జరుగుతుంది. కాబట్టి పచ్చటి కాయ తినకూడదు

గ్రహణ సమయంలో అపోహలను వదలండి…..
గ్రహణ సమయంలో చాలా మంది ఆహారం తినకూడదు, బయట తిరగకూడదు అనే రకరకాల మూడనమ్మకాలు, అపోహలు పడుతుంటారు. కానీ సూర్య గ్రహణం సమయంలో కిరణాల నుంచి వచ్చే ఇంటెన్సివ్ వల్ల ఎక్కువ సమయం చూడడం వల్ల కంటిచూపు సమస్యలు వస్తాయి. సోలార్ ఫిల్టర్ గ్లాసెస్ వినియోగించాలి. గర్బిణీలు రాత్రి సమయంలో స్నానం చేయకూడదు అనేది కూడా అపోహా మాత్రమే అని వైద్య విద్యార్థులు చార్ట్స్ ద్వారా అవగహన కల్పించారు. ఇతర పలు రకాల ఆరోగ్య విషయాలపై పలు చార్ట్స్, స్టాళ్ల ద్వారా అవగహన కల్పించారు.

అనంతరం మెడికల్ కళాశాల సైకియాట్రి విభాగ హెచ్‌ఓడీ డాక్టర్ శాంతి, ఫల్మనాలజీ విభాగ డాక్టర్ వేణు, డాక్టర్ మాధవ్, డాక్టర్ సదానందం ఎగ్జిబిషన్‌లో స్టాళ్లను పరిశీలించి ఉత్తమ స్టాళ్లను ఎంపిక చేసి అభినందించారు. అలాగే అనేక్రలైన స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్యర్థులకు ప్రజలకు అవగాహన కల్పించారు.