కోరుట్ల, ముద్ర: శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా కోరుట్ల శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఉదయాన్నే ప్రబంధ కారిణి కార్యదర్శి వనపర్తి చంద్ర మోహన్ రమ్య దంపతుల ఆద్వర్యంలో శ్రీరామునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాపీఠం ఆవిర్భవించిన కాలాన్ని, విదానాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి చెట్పల్లి శంకర్, ఉపాధ్యక్షులు వడ్లకొండ రాజ గంగాధర్, సభ్యులు ముదిగొండ రాజేశం, బీమనాతి రాజగంగారం, ప్రబంధ కారిణి సహ కార్యదర్శి కొత్త సందీప్, సభ్యులు అందె శివ ప్రసాద్, కొండ బత్తిని అమర్నాథ్, తాడికొండ విశాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపు వెంకటేష్, ఆచార్య బృందం పాల్గొన్నారు.