ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని గురువారం నిర్మల్ పట్టణంలోని జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది. ఈ ఎన్నికలలో బర్ల శుభకరన్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ప్రధాన ఎన్నికల అధికారి న్యాయవాది వోస మహేందర్ సహాయ ఎన్నికల అధికారి వంగ శ్యామ్ సుందర్ రెడ్డి లు ప్రకటించారు. ఉపాధ్యక్షునిగా అబ్బడి నర్సారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కటకం అజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఆర్ రత్నం, కోశాధికారిగా చిన్నబోని అర్చన, కల్చరల్ సెక్రటరీగా పి వంశీ, గ్రంథాలయ కార్యదర్శిగా కే నివేదిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.