- డిపో మేనేజర్ వేణుగోపాల్
ముద్ర.వనపర్తి: ఏప్రిల్ 12 న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణ కు వనపర్తి డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ బస్సు ఏప్రిల్ 10న రాత్రి 8.00 గంటలకు వనపర్తి డిపో నుండి బయలుదేరి 11వ తేదీ ఉదయం కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనం, సాయంత్రం వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం, అనంతరం రాత్రి వరకు అరుణాచలం చేరుకుంటుందని వివరించారు. మరుసటి రోజు ఏప్రిల్ 12 ఉదయము అరుణాచల గిరి ప్రదక్షణ, దర్శనం తర్వాత సాయంకాలం నాలుగు గంటలకు బయలుదేరి 13వ తేదీ ఉదయం నాలుగు గంటల వరకు వనపర్తి డిపోకు చేరుకుంటుందని ఈ అవకాశాన్ని వనపర్తి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు మరింత సమాచారం కోసం కింది నంబర్లలో సంప్రదించాలని 9959226289 7995701851,9676563377, 7382829379 వనపర్తి డిపో మేనేజర్ కోరారు.