Take a fresh look at your lifestyle.

ప్రాణాలు పోయినా సరే మా భూములు ఇవ్వము

  • అధికారులకు తేల్చి చెప్పిన రైతులు.

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం అనంతవరం గ్రామంలోఉమామహేశ్వర ప్రాజెక్టు భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నరూ.బలవంతంగా ప్రాజెక్టుల కోసం పంటలు పండే భూమిని సేకరించడం అన్యాయమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం తమ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసు బలగాలతో సర్వే చేయడానికి వచ్చిన అధికారులను, విత్తనాలు వేసే సమయంలో భూములు సర్వే చేయొద్దని రైతులు అడ్డగించారు.అనంతవరం గ్రామ శివారులో ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం భూ సేకరణలో భాగంగా భూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను ప్రాజెక్టు ఎక్కడైతే ప్రారంభమైతుందో అక్కడి నుండి భూసేకరణ జరిగితే బాగుంటుందని విత్తనాలు వేసే సమయంలో ఇలా భూసేకరణ సమయంలో సర్వే చేయడం ఏంటని అధికారులను గ్రామస్తులు నిలదీశారు.ప్రాణాలనేనా పోగొట్టుకో దానికైనా సిద్ధంగా ఉన్నామని తమ భూములు ఇవ్వమని గ్రామస్తులు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.