Take a fresh look at your lifestyle.

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత

  • సుస్థిరమైన పర్యావరణంతోనే భావితరాల మనుగడ సుస్థిరమైన పర్యావరణంతోనే భావితరాల భవితవ్యం.
  • ప్లాస్టిక్ రహిత పర్యావరణాన్ని సృష్టించడం కీలకం.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కరీంనగర్ శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వం ఆర్ట్స్, సైన్స్ కళాశాల ఆటానమస్ వృక్షశాస్త్ర విభాగం,  జంతు శాస్త్ర విభాగం,  జాతీయ సేవా పథకం, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల అటానమస్,  కాకతీయ ప్రభుత్వ కళాశాల అటానమస్ హనుమకొండ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రంగసాయిపేట వరంగల్ సహకారంతో ఒకరోజు జాతీయ ఆన్లైన్ సెమినార్ నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ పేర్కొన్నారు.ఈ ఆన్లైన్ సెమినార్ కి ముఖ్య వక్త ప్రొఫెసర్ డబ్ల్యూ జి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఆవశ్యకత పర్యావరణం పట్ల ప్రజల భాగస్వామ్యం విద్యార్థుల భాగస్వామ్యం కళాశాలల భాగస్వామ్యం మొదలైన అంశాలను కూలంకషంగా వివరించారు. తదనంతరం రిసోర్స్ పర్సన్ గా ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగ ఆచార్యులు ఏ విజయభాస్కర్ రెడ్డి  మాట్లాడుతూ సుస్థిరమైన పర్యావరణం ప్లాస్టిక్ రహిత సమాజం సృష్టించడం మన అందరి బాధ్యత అని ప్రజల భాగస్వామ్యంతోనే యువకుల భాగస్వామ్యంతోని ఆరాధకరమైన పర్యావరణాన్ని సృష్టించవచ్చని పర్యావరణ సమస్యల వల్ల ప్రజల ఆరోగ్యం జీవ ఆవరణ వ్యవస్థలు దెబ్బతిని విపరీతమైన వ్యాధులు విస్తరిస్తాయని వ్యాధి రహిత సమాజం కోసం అందరూ ముందే మేలుకోవాలని సూచించారు.150 మైక్రానుల కంటే  తక్కువ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ ను వాడకూడదని, ప్లాస్టిక్ నిషేధించకపోతే క్యాన్సర్ తో కుటుంబాలు అర్ధాంతరంగా నష్టపోతారని,  దీనివలన సామాజిక ఆర్థిక నష్టంతో పాటుగా ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని ప్లాస్టిక్స్ ను నిషేధించాలని ప్లాస్టిక్స్ ప్రత్యామ్నాయంగా మాత్రమే జ్యూట్ బ్యాగులను,  సూపర్ బ్యాగులను, క్లాత్ బ్యాగులను వాడితే పర్యావరణ హితులవుతారని, పర్యావరణ ప్రేమికులవుతారని, పర్యావరణ మిత్రులు అవుతారని ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ పేర్కొన్నారు.కార్యక్రమానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ పడాల తిరుపతి వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అటానమస్ కరీంనగర్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి నితిన్, డాక్టర్ తాళ్లపల్లి రాజయ్య, డాక్టర్ కే రజనీలత, డాక్టర్ ఈ కోమల, డాక్టర్ యుగేందర్, డాక్టర్ తిరు కోవెల శ్రీనివాస్, డాక్టర్ ప్రమోద్, డాక్టర్ జి చంద్రయ్య డాక్టర్ సుజాత, డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి, డాక్టర్ కే కిరణ్ మై, డాక్టర్ తాహీరు హుస్సేన్, డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ కళాజ్యోతి, డాక్టర్ తోట మహేష్, డాక్టర్ ప్రీతి, డాక్టర్ బి రమ్య, డాక్టర్ ఆసంపల్లి స్వరూప రాణి, డాక్టర్ మహమ్మద్ తాజుద్దీన్, డాక్టర్ ఈ సమత, డాక్టర్ డి సుజాత, డాక్టర్ గోగి కార్ భగీరథ, డాక్టర్ డి పార్వతి, డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ మాలతి లత, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ నాంపల్లి లింగన్న,తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ హలీం ఖాన్ తో అధ్యాపకులు, విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.