Take a fresh look at your lifestyle.

పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

 
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.
బుధవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులు మరియు సిబ్బంది ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని రిజిస్టర్లను చెక్ చేశారు. డాక్టర్లు,సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రతిరోజు ఓ.పి కి ఎంతమంది వస్తున్నారని ఓ.పి రిజిస్టర్ ను పరిశీలించారు. అదనపు కలెక్టర్ ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ పేషంట్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన చికిత్సలు అందిస్తున్నారా అని ఆసుపత్రికి వచ్చిన పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల తో అదనపు కలెక్టర్ మాట్లాడారు. డాక్టర్లు, సిబ్బంది మంచిగా చూస్తున్నారా అని ఆరా తీశారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను ప్రతిరోజు శుభ్ర పరచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.