కోరుట్ల/మెట్ పల్లి, ముద్ర:- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం లోని ముత్యంపేట గ్రామానికి చెందిన విద్యార్థి మామిడాల నితీష్ కుమార్ ఉన్నత చదువుల కొరకు లండన్ లోని యూనివర్సిటీలో సీటు గురించి ప్రయత్నం చేస్తుండగా టెలిగ్రామ్ యాప్ (సెల్ ఫోన్) లో లండన్ లో ఉన్న ఒక వ్యక్తి తనకు తానుగా నా పేరు షణ్ముఖ కృష్ణ యాదవ్ అని నివాసం తిరుపతి అని పరిచయం చేసుకొన్నాడు. నితీష్ కుమార్ తో ఏర్పడకుండా తాను లండన్ లో చదివి, ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మాయమాటలతో నితీష్ కుమార్ ని మోసపూరితంగా నమ్మించి నువ్వు ఇక్కడికి వచ్చి ఇండియా డబ్బులతో ఫీజు కడితే ఎక్కువ ఖర్చు అవుతుందని, నిందితుడు తన బ్యాంక్ అకౌంట్ తిరుపతిలో ఉన్నట్లు (బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి టౌన్) బ్యాంకు సంబంధించిన పాస్ బుక్ వాట్సప్ లో పంపాడు. డబ్బులు వేస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లండన్ కరెన్సీ తో యూనివర్సిటీ డబ్బులు కడతానని, కృష్ణా యాదవ్ యొక్క పాస్ పోర్ట్ కూడా వాట్సాప్ లో పెట్టగా, నితీష్ కుమార్ నమ్మి తన తల్లిదండ్రులకు చెప్పి, డబ్బులు అప్పు తీసుకొని వచ్చి కృష్ణ యాదవ్ యొక్క తిరుపతి లో ఉన్న బ్యాంక్ ఎకౌంటు కి ముత్యంపేట గ్రామంలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుండి నితీష్ కుమార్ తల్లి మామిడాల లత తన అకౌంట్లో నుండి మొదటగా 5 లక్షల 75 వేలు, నితీష్ కుమార్ అకౌంట్ నుండి 25 వేలు మొత్తంగా 6 లక్ష రూపాయలు పంపించారు.
తర్వాత నితీష్ కుమార్ లండన్ లో ఉన్న కృష్ణ యాదవ్ ని నాకు సీట్ కు డబ్బులు కట్టినట్లు రసీదు పంపాలని అడుగగా, పంపుతానని కొన్ని రోజులు చెప్పి, తర్వాత సెల్ ఫోన్ ఆఫ్ చేసాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది మాట్లాడనందున మోసం చేసినట్లు గ్రహించి మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో 2023 లో కృష్ణ యాదవ్ పై కేసు నమోదు చేసద్. ఆనంతరం కోర్టు నుండి పర్మిషన్ తీసుకుని జిల్లా ఎస్పీ గారి ద్వారా ఎల్వోసి పంపించాడు. కొద్ది రోజులకు నితీష్ కుమార్ తల్లిదండ్రులు డబ్బులు జమ చేసి ఇవ్వగా లండన్ వెళ్లిపోయి చదువుకుంటూ, అక్కడ కూడా కృష్ణ యాదవ్ గురించి వెతికాడు. గురువారం రోజు ఉదయం కృష్ణ యాదవ్ లండన్ నుండి ఫ్లైట్లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి రాగా ఎయిర్ పోర్ట్ లో కృష్ణ యాదవ్ ని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వారు గుర్తించి పట్టుకొని మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డికి తెలుపగా, సీఐ వెంటనే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి మల్లాపూర్ ఎస్సై రాజుని పంపి సాయంత్రం నాలుగు గంటలకు ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ వారి అనుమతితో కృష్ణ యాదవ్ ని అదుపులోనికి తీసుకొని మెట్ పల్లి కి తీసుకొచ్చారు. సీఐ నిందితున్ని విచారించగా, తాను ఆరు లక్షల రూపాయలు నితీష్ కుమార్ ని మోసపూరితంగా నమ్మించి తన అకౌంట్లో డబ్బులు వేయించుకొని వాటిని మా తండ్రి జయరామయ్య ద్వారా నేను లండన్ కు తెప్పించుకొని వాడుకున్నానని అన్నాడు. నేరంలో తండ్రి కూడా సహకరించినట్లు తన నేరమును ఒప్పుకొనగా అతనిని కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డితో పాటు ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడి అమాయకులను మోసం చేసి డబ్బులు తీసుకున్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని మరియు సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువకులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఫోన్ లు చేసి ఏదైనా మోసపూరిత విషయాలు చెప్పి నమ్మించినట్లయితే ప్రజలు గమనించి ఎవరికీ OTP లు చెప్పవద్దని ఏలాంటి అనుమానం ఉన్న వెంటనే 1930 కి ఫోన్ చేయాలని లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సిఐ నిరంజన్ రెడ్డి ప్రజలకు సూచించారు. మండలం లోని ముత్యంపేట గ్రామానికి చెందిన విద్యార్థి మామిడాల నితీష్ కుమార్ ఉన్నత చదువుల కొరకు లండన్ లోని యూనివర్సిటీలో సీటు గురించి ప్రయత్నం చేస్తుండగా టెలిగ్రామ్ యాప్ సెల్ ఫోన్ లో లండన్ లో ఉన్న ఒక వ్యక్తి తనకు తానుగా షణ్ముఖ కృష్ణ యాదవ్ అని నివాసం తిరుపతి అని పరిచయం చేసుకొన్నాడు. నితీష్ కుమార్ తో ఏర్పడకుండా తాను లండన్ లో చదివి, ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మాయమాటలతో నితీష్ కుమార్ ని మోసపూరితంగా నమ్మించి నువ్వు ఇక్కడికి వచ్చి ఇండియా డబ్బులతో ఫీజు కడితే ఎక్కువ ఖర్చు అవుతుందని, నిందితుడు తన బ్యాంక్ అకౌంట్ తిరుపతిలో ఉన్నట్లు(బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి టౌన్) బ్యాంకు పాస్ బుక్ వాట్సప్ లో పంపాడు.
డబ్బులు వేస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లండన్ కరెన్సీ తో యూనివర్సిటీ డబ్బులు కడతానని, కృష్ణా యాదవ్ యొక్క పాస్ పోర్ట్ కూడా వాట్సాప్ లో పెట్టగా, నితీష్ కుమార్ నమ్మి తన తల్లిదండ్రులకు చెప్పి, డబ్బులు అప్పు తీసుకొని వచ్చి కృష్ణ యాదవ్ యొక్క తిరుపతి లో ఉన్న బ్యాంక్ ఎకౌంటు కి ముత్యంపేట గ్రామంలో ఉన్న ఇండియన్ బ్యాంకు నుండి నితీష్ కుమార్ తల్లి మామిడాల లత తన అకౌంట్లో నుండి మొదటగా 5 లక్షల 75 వేలు, నితీష్ కుమార్ అకౌంట్ నుండి 25 వేలు 6 లక్ష రూపాయలు పంపించినారు. తర్వాత నితీష్ కుమార్ లండన్ లో ఉన్న కృష్ణ యాదవ్ ని నాకు సీట్ కు డబ్బులు కట్టినట్లు రసీదు పంపాలని అడుగగా, పంపుతానని కొన్ని రోజులు చెప్పి, తర్వాత సెల్ ఫోన్ ఆఫ్ చేసాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది మాట్లాడనందున మోసం చేసినట్లు గ్రహించి మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో 2023 లో కృష్ణ యాదవ్ పై కేసు నమోదు చేసద్. ఆనంతరం కోర్టు నుండి పర్మిషన్ తీసుకుని జిల్లా ఎస్పీ గారి ద్వారా ఎల్వోసి పంపించాడు.
కొద్ది రోజులకు నితీష్ కుమార్ తల్లిదండ్రులు డబ్బులు జమ చేసి ఇవ్వగా లండన్ వెళ్లిపోయి చదువుకుంటూ, అక్కడ కూడా కృష్ణ యాదవ్ గురించి వెతికాడు. గురువారం రోజు ఉదయం కృష్ణ యాదవ్ లండన్ నుండి ఫ్లైట్లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి రాగా ఎయిర్ పోర్ట్ లో కృష్ణ యాదవ్ ని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వారు గుర్తించి పట్టుకొని మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డికి తెలుపగా, సీఐ వెంటనే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి మల్లాపూర్ ఎస్సై రాజుని పంపి సాయంత్రం నాలుగు గంటలకు ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ వారి అనుమతితో కృష్ణ యాదవ్ ని అదుపులోనికి తీసుకొని మెట్ పల్లి కి తీసుకొచ్చారు. సీఐ నిందితున్ని విచారించగా, తాను ఆరు లక్షల రూపాయలు నితీష్ కుమార్ ని మోసపూరితంగా నమ్మించి తన అకౌంట్లో డబ్బులు వేయించుకొని వాటిని మా తండ్రి జయరామయ్య ద్వారా నేను లండన్ కు తెప్పించుకొని వాడుకున్నానని అన్నాడు. నేరంలో తండ్రి కూడా సహకరించినట్లు తన నేరమును ఒప్పుకొనగా అతనిని కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డితో పాటు ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడి అమాయకులను మోసం చేసి డబ్బులు తీసుకున్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని మరియు సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువకులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఫోన్ లు చేసి ఏదైనా మోసపూరిత విషయాలు చెప్పి నమ్మించినట్లయితే ప్రజలు గమనించి ఎవరికీ OTP లు చెప్పవద్దని ఏలాంటి అనుమానం ఉన్న వెంటనే 1930 కి ఫోన్ చేయాలని లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సిఐ నిరంజన్ రెడ్డి ప్రజలకు సూచించారు.