Take a fresh look at your lifestyle.

కె.పి.హెచ్.బి లో పేకాట స్థావరంపై దాడి: ఆరుగురు అరెస్ట్, రూ. 2.8 లక్షలు స్వాధీనం

 

 

ముద్ర కూకట్‌పల్లి :

కేపీహెచ్‌బీ కాలనీలోని భగత్ సింగ్ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం రాత్రి భగత్ సింగ్ నగర్ 6వ ఫేజ్‌లోని ఒక ఇంట్లో కొందరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పణంగా పెట్టి పేకాట  ఆడుతున్నట్లు కేపీహెచ్‌బీ ఎస్.ఐ శ్రీనివాస్‌కు నమ్మదగిన సమాచారం అందింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించిన పోలీసులు, ఇద్దరు సాక్షులతో కలిసి రాత్రి 8:30 గంటల సమయంలో సదరు నివాసంపై దాడి చేశారు.

​పోలీసుల తనిఖీల్లో ఆరుగురు వ్యక్తులు సర్కిల్‌గా కూర్చుని పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిని విచారించగా, వారంతా ఫోన్ల ద్వారా సంప్రదించుకుని, ఒక చోట చేరి జూదం ఆడుతున్నట్లు అంగీకరించారు.

​అరెస్టయిన వారు

​గొట్టిముక్కల శ్రీరామరాజు (59)

​శ్యామల మధు కుమార్ (55)

​బొమిటి సుధీర్ కుమార్ (38)

​ఆర్. సురేందర్ కుమార్ (55)

​నుక్కల సత్యనారాయణ (53)

​పెనుమత్స కళ్యాణ్ చక్రవర్తి (45)

​స్వాధీనం చేసుకున్న వస్తువులు:

​నగదు: రూ. 2,80,330/-

6 మొబైల్ ఫోన్లు  20 సెట్ల పేకాట ముక్కలు, 80 పోకర్ చిప్స్ రికవరీ చేసుకోని​ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.