మంథని, ముద్ర: మంత్రపురిలోని శ్రీ శీలేశ్వర – సిద్దేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞములో భాగంగా బుధవారం గర్రెపల్లి మహేశ్వర శర్మచే ఆధ్యాత్మిక ప్రవచనము భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం 8:30 నుండి 1:00 వరకు గురు వందనము నిత్య పూజ గాయత్రి జప సహిత ఋగ్వేద పారాయణ స్వాహాకారము, సాయంత్రం 5 గంటలకు సుహాసినిలచే స్తోత్ర పారాయణము,ప్రదోష పూజ రుద్రక్ర మార్చన అనంతరం భజన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు చింతలపల్లి ఉమా శంకర్,ఒజ్జల గణేష్, ఆమ్నాయవర్ధిని మిత్రబృందము తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలయమైన మంథనిలో ఇలాంటి కార్యక్రమము నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆలయ నిర్వాహకులు లోకే మనోహర్, లోకే శరత్ తెలిపారు.