– పట్టణ సీఐ రమేష్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రత్నాపురం శ్రీశైలం
ముద్ర ప్రతినిధి, భువనగిరి
భక్తి భావనలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని భువనగిరి పట్టణ సీఐ రమేష్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం అన్నారు. భువనగిరి గణేష్ ఉత్సవ సమితి సమావేశం బుధవారం స్థానిక రిటైర్డ్ ఎంప్లాయిస్ భవనంలో గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అందరికీ అందుబాటులో ఎప్పుడు పోలీసుల శాఖ అందుబాటులో ఉంటామని మీ మీ మండపాల వద్ద మీరందరూ కూడా ఉండాలని సూచించారు. ఉత్సవ సమితి అధ్యక్షులు రత్నాపురం శ్రీశైలం మాట్లాడుతూ భువనగిరిలో వినాయక నవరాత్రుల నిర్వాహకులు నవరాత్రులు భక్తిశ్రద్ధలతో నియమ నిబంధనలతో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ గణనాథుడు నిమజ్జనం చేసువాలన్నారు. మరుసటి రోజు మండపాల వద్ద కలక్షంలో ఉన్న బియ్యాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదం తీసుకునేంతవరకు బాధ్యతగా ఉండాలని నిర్వాహకులను కోరారు. నిమజ్జన శోభాయాత్రలో ఎక్కడ ఎలాంటి అపశృతి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ స్తంభాల వద్ద దూరంగా ఉంటూ వర్షాకాలంలో నిర్వహించే ఈ పండుగ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గణేష్ ఉత్సవ సమితి గౌరవ సలహాదారుడు సుర్వి శ్రీనివాస్ మాట్లాడుతూ భువనగిరిలో గణేష్ నవరాత్రులు ఎంతో అత్యంత వైభవంగా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 1990 నుండి ఈ సాంప్రదాయాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. పార్టీలకతీతంగా కులమతాలకతీతంగా కలిసికట్టుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాదిరిగా సామూహికంగా భువనగిరిలో చాలా వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ చందు, కోశాధికారి పోగల రవీందర్, కాలేరు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు నమోదు రాజు, కాలియా నాగరాజు, టి.రాజ్ కుమార్, వాస నర్సింగ్, మహంకాళి సురేష్, కానుగంటి ప్రేమ్, కానుకుంట్ల రమేష్, సుర్వి మణికంఠ, సాయికిరణ్, సాయి చరణ్, వివిధ భక్త భజన యూత్ అసోసియేషన్లు సభ్యులు పాల్గొన్నారు.