Take a fresh look at your lifestyle.

హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానెల్ విజయం

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: జవహర్ లాల్ నెహ్రూ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో టీయూడబ్ల్యూజే – ఐజేయూ బలపరిచిన ఫ్రెండ్స్ ప్యానల్ ఘనవిజయం సాధించింది. వంశీ శ్రీనివాస్, నేమాని భాస్కర్ డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు.

 

నేమాని భాస్కర్, వంశీ శ్రీనివాస్ ఎన్నిక పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు కే విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే రామనారాయణ, ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు.

 

సొసైటీ సభ్యులకు ఇళ్ల స్థలాలు సాధించడంలో వారు నిర్విరామంగా కృషి చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.