ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు,రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి, వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 60 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 42,జిల్లా పంచాయతీ 2, సర్వే ల్యాండ్ 6 కోపరేటివ్ 2, జిల్లా పంచాయతీ 2, ఎస్సీ వెల్ఫర్,ఇరిగేషన్,మత్స్య శాఖ, ట్రాన్స్పోర్ట్, మున్సిపాలిటీ ,సివిల్ సప్లైస్ శాఖలకు ఒక్కటి చొప్పున వచ్చాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సి.ఈ.ఓ శోభారాణి ,డి.ఆర్.ఓ జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.