- హిందు వాహిని అమ్రాబాద్
ముద్ర విలేఖరి, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ పోలీస్ స్టేషన్లో హిందు వాహిని అమరేశ్వర దేవాలయ కమిటీ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో గోవదను గోవుల అక్రమ రవాణాను నియంత్రించాలని అమ్రాబాద్ పోలీస్ స్టేషన్లో వినతి పత్రం ఇచ్చారు.ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కువ ఆవులను ఆరోగ్యకరంగా ఉన్న ఎద్దులు దున్నలు గేదేలు దూడలను కబేలాలకు తరలిస్తూ వాటిని వధిస్తున్నారు పండగల పేరిట గోవులను వధించడం చాలా బాధాకరమైన విషయమని గోవదను ఆపకుంటే రాబోయే తరానికి గోవులు అనేవి కనిపించకుండా కనుమరుగవుతావని ఆవేదన వ్యక్తం చేశారు.మరియు అమ్రాబాద్ టౌన్ లో మండలంలో ఆవులను రహస్యంగా వధించడానికి కుట్రలు జరుగుతున్నాయి కావున పోలీస్ శాఖ వారు అప్రమత్తంగా ఉండి ఈ ప్రాంత అరుదైన తూర్పు పోడ జాతి ఆవులను కాపాడే విధంగా హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆవులను కాపాడి హిందువు ల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ అమరేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షులు గంగిశెట్టి నాగరాజు, వివేకానంద యూత్ అధ్యక్షులు నోముల పరమేష్ గౌడ్, హిందూ వాహిని అధ్యక్షులు నోముల శంకర్ గౌడ్, మొగిలి గణేష్, నోముల అక్షిత్ గౌడ్, ఏలిజాల రాఖి, ఎలిజాల రాజు, తదితరులు పాల్గొనడం జరిగింది.
