స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన మహానేత శ్రీపాదరావు: 89వ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళి
శ్రీపాద రావు గారి సేవలు మరువలేనివి
శ్రీపాద రావు 89వ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు..
ధర్మపురి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా పనిచేసి స్పీకర్ పదవికి దేశ వ్యాప్తంగా వన్నె తీసుకు వచ్చిన గొప్ప నాయకులు స్వర్గీయ శ్రీపాదరావు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణ కేంద్రంలో స్వర్గీయ శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచలుగా ఎదిగి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభకు శ్రీపాద రావు గారు స్పీకర్ గా వ్యవహరించారని గుర్తు చేశారు. స్పీకర్ గా పనిచేస్తున్న సమయంలో ప్రతిపక్ష నేతలకు సైతం సమయం ఇస్తూ స్పీకర్ పదవికి వన్నె తీసుకువచ్చారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు శ్రీపాదరావు అండగా నిలిచి వారి కష్టాల్లో భాగమయ్యారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి శ్రీపాద రావు గారు చేసిన సేవలు మరువలేని అని మంత్రి పేర్కొన్నారు.
తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు రాజకీయాల్లో రాణిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తనలాంటి సామాన్య కార్యకర్తను రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా చేసిన ఘనత శ్రీధర్ బాబు గారికి దక్కుతుందని మంత్రి తెలిపారు. ధర్మపురి తో నాడు శ్రీపాదరావు గారికి నేడు మంత్రి శ్రీధర్ బాబు గారికి విడదీయలేని సంబంధం ఉందని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారం రామన్న తోపాటు పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.