పోటీ చేసిన అన్ని చోట్లా కాంగ్రెస్ క్లిన్ స్వీప్- తమిళనాడు ఎన్నికల ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– తమిళనాట రాహూల్ గాంధీకి ప్రజాదరణ పెరుగుతుంది
– ఊటీ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం
– తేయాకు తోటల రైతుల ప్రయోజనాల పరిరక్షణ చర్యలు తీసుకుంటాం
– బిజెపి ఎత్తుగడలను తిప్పికొట్టండి
ముద్ర హైదరాబాద్ :
డి.యం.కే కూటమితో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేయనుందని తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల అభివృద్ధి శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణనే ఇందుకునిదర్శనమని ఆయన చెప్పారు.
తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన స్టార్ క్యాంపెయన్ గా నియమితులైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నుండి అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచారసభలలో పాల్గొంటూ విస్తృతంగా పర్యటిస్తున్నారు.
అందులో భాగంగా మంగళవారం తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా ఉథగమండలం ఊటి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఊటి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి.రామచంద్రన్ ను గెలిపిస్తే ఊటి కున్న ప్రాశస్త్యం కాపాడడంతో పాటు ఊటి అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ప్రధానంగా తేయాకు తోటల మీద ఆధారపడి ఉన్న రైతాంగాం ప్రయోజనాల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
తమిళనాడు లో పాగా వేసేందుకు రంగంలోకి దిగిన భారతీయ జనతా పార్టీని కట్టడి చేసి తమిళనాడు సంస్కృతి సాంప్రదాయల పరిరక్షణకు ఓటర్లు సిద్ద పడాలని ఆయన పిలుపునిచ్చారు.
తమిళనాడులో మళ్ళీ వచ్చేది డియంకే కాంగ్రేస్ కూటమి ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.
కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న 28 స్థాసనాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సునాయాసమేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
అంతర్గత సర్వేలు అన్నీ అవే ఉటంకిస్తున్నాయని డి.యం.కే కాంగ్రెస్ పార్టీ కూటమి లు కుడా సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో దూసుకు పోతున్నాయని ఆయన తెలిపారు.
గడిచిన ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మెజార్టీ శాతం గణనీయంగా పెరగనుందని ఆయన పేర్కొన్నారు.ఊటి వంటి నియోజకవర్గంలో ఎవరూ ఊహించని మెజారిటీ రాబోతుందని ఆయన చెప్పారు.
తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యహారాల ఇంచార్జ్ గిరీష్ చోడంకర్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే. సెల్వపేరుంతగై లు రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ ను క్యాడర్ ను సమన్వయం చేస్తున్నారని ఆయన చెప్పారు.
తమిళప్రజలు,ఇక్కడి సంస్కృతి-సాంప్రదాయలపై తనకు వ్యక్తిగతంగా ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయని ఇక్కడి ప్రజల పట్ల నాకు స్పష్టత ఉందని ఆయన చెప్పారు.
ఏ.ఐ.సి.సి ఎన్నికల పరిశీలకుడిగా తనను ఇక్కడికి పంపిన నేపద్యంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న స్థానాలలో విస్తృతంగా పర్యటిస్తూ భాగస్వామ్య పక్షాలతో సహా కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని ప్రణాళికా బద్దంగా ఎన్నికల భేరికి సన్నద్ధం చేశామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో డి.యం.కె-కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అధికారంలోకి వచ్చాక ఊటి లో కావలసిన మౌళిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.