ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
టైలరింగ్ వృత్తినే జీవనాధారంగా చేసుకుని కుటుంబాలను పోషిస్తున్న మేరు కుల మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న “స్వింగ్ మిషన్ టు ఉమెన్” పథకంలో తొలి ప్రాధాన్యత కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా మేరు సంఘం నాయకులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు.
మంగళవారం భువనగిరిలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున బీసీ మహిళలకు కుట్టు మిషన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో నిజంగా టైలరింగ్ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న మేరు కుల మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ మేరు కులానికి చెందిన అనేక కుటుంబాలు తరతరాలుగా టైలరింగ్ వృత్తినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నాయని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న కుట్టు మిషన్లు ఎంతో ఉపయోగకరమవుతాయని తెలిపారు. అర్హులైన మహిళలకు పారదర్శకంగా పథకం అమలు చేసి న్యాయం చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మేరు సంఘం అధ్యక్షులు కాటారం భాస్కర్, ప్రధాన కార్యదర్శి కొట్టూరి రాజమల్లప్ప, కోశాధికారి కొత్త భాస్కర్, ఉపాధ్యక్షులు కొత్త అంజనేయులు సంఘం నాయకులు, సంఘ సభ్యులు పాల్గొన్నా
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post