Take a fresh look at your lifestyle.

నగరం పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

  • జిల్లా కలెక్టర్,రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కోయ శ్రీ హర్ష.
  • ప్రతి డివిజన్ లో వారానికి రెండుసార్లు ఫాగింగ్ చేయాలి.
  • రామగుండం నగరంలో విస్తృతం గా పర్యటించిన జిల్లా కలెక్టర్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్, రామగుండంమున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కోయ శ్రీ హర్ష తెలిపారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం నగరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్ జే.అరుణ శ్రీ తో కలిసి విస్తృతంగా పర్యటించారు.నగర కార్పొరేషన్ పురపాలక కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్,రెవెన్యూ వసూళ్ల పై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. అనంతరం శివాజీ నగర్ మార్కెట్ ఏరియా, కళ్యాణ్ నగర్ విద్యుత్ లైన్ పనులు,ఊర్వసి టాకీస్,సిరి ఫంక్షన్ హాల్ సమీపంలోని అడ్డగుంటపల్లి లో నిర్మాణం అవుతున్న డ్రైయిన్ డి సిల్టింగ్, మార్కండేయ కాలనీ,శాలపల్లి రోడ్డు ప్రాంతాలలో జరుగుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రామగుండం కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు కృషి చేయాలని ఆదేశించారు. మురుగు కాల్వల డీసిల్టింగ్ రెగ్యులర్ గా చేయాలని అన్నారు. ‌ప్రతి డివిజన్ పరిధిలో వారానికి రెండు సార్లు ఫాగింగ్ చేయాలని, అవసరమైన ఫాగ్గింగ్ యంత్రాలను అదనంగా కొనుగోలు చేయాలని,దోమల నివారణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.శివాజీ నగర్ మార్కెట్ ఏరియా పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని,బయట ఎక్కడ వ్యాపారాలు అమ్మకుండా మార్కెట్ లో మాత్రమే అమ్మేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఊర్వసి టాకీస్ సమీపంలోని డ్రైయిన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.అడ్డగుంట పల్లి, సిరి ఫంక్షన్ హాల్ వద్ద డ్రైయిన్ డి సిల్టింగ్ పనులు పరిశీలించి వాన కాలంలో ఎక్కడ నీరు నిల్వ ఉండ కుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్యాణ్ నగర్ లో విద్యుత్ పనుల తరలింపు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.మార్కండేయ కాలనీ రోడ్డు వద్ద ఎక్కడ గుంతలు లేకుండా చూడాలని అన్నారు.శాలపల్లి రోడ్డు వద్ద 2 కోట్లతో నిర్మాణం అవుతున్న సిసి రోడ్లు పనులు నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం గోదావరిఖని మార్కండేయ కాలనీలోనిమహాత్మ జ్యోతిబాపూలే వసతి గృహాన్ని పరిశీలించి వసతి గృహం లో ఉన్న వసతుల ఏర్పాట్లను పరిశీలించి విద్యార్థులకు ఆధునిక బోధన,నాణ్యమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి ,ఎస్ఈ శివానంద్, ఈ. ఈ.రామన్ సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.