Take a fresh look at your lifestyle.

తల్లిని చంపిన తనయుడు

 

కోరుట్ల, ముద్ర
భార్య భర్తల మధ్య జరిగిన గొడవలో తల్లి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మల్లాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకు 90 అనునామెకు ఒక కొడుకు, ఒక కూతురు సంతానం కాగా తల్లి వెంకు మల్లాపూర్ లోని తన కొడుకు నంబయ్య కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నది. నంబయ్య తరచు అతని భార్య లక్ష్మీతో గొడవ పడేవాడు. తన తల్లి గొడవ వద్దు అని నంబయ్యను మందలించేది. అదే క్రమంలో శుక్రవం రోజున సాయంత్రం నంబయ్య ఎప్పటి లాగే తన భార్యలక్ష్మి తో గొడవపడి బూతులు తిడుతుండగా , నంబయ్య తల్లి అతడిని మందలించింది. కోపోద్రిక్తుడైన నంబయ్య తన తల్లిని బూతులు తిట్టడమే కాకుండా ముఖం పైన నుదటి పైన బలంగా పిడికిలితో గుద్ది, మంచం పై నుండి కిందికి ఎత్తేయడంతో మృతి చెందింది. మల్లాపూర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రేగెల అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అనిల్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.