Take a fresh look at your lifestyle.

కనుల పండుగగా శ్రీనివాస కళ్యాణం 

ముద్ర కార్వాన్: గోవిందా గోవిందా అన్న శ్రీనివాసుని నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. త్రివేణి సంగం వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు మూడవరోజు భక్తి ప్రపత్తులతో సాగాయి. చారిత్రాత్మక దేవాలయం జానకి సమేత వీర వెంకట విజయ రాఘవస్వామి ఆలయంలో మంగళవారం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. రాత్రి వేద పండితులు రాజనర్సింహ చారి ఆధ్వర్యంలో పీఠాధిపతి రాహుల్ దాస్ బాబా చేతుల మీదుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం కనుల పండుగగా జరిపారు. అనంతరం కల్యాణ వేంకటేశ్వరుని స్వర్ణ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. తదనంతరం భక్తులకు అన్నదానం చేశారు.

నేడు లక్ష్మీనరసింహ కళ్యాణం…

త్రివేణి సంగం శ్రీ రామచంద్ర జీ వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం హోమాలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు లక్ష్మి నరసింహని కళ్యాణ్ నిర్వహిస్తారు.

Leave A Reply

Your email address will not be published.