- రాష్ట్రంలో బీవైడీ కార్ల తయారీ యూనిట్‌పై కంపెనీ ప్రకటన.
- చర్చలు జరుపుతున్నాం.
- పరిశ్రమ ఏర్పాటుపై ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు.
- ప్రకటించిన బీవైడీ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను బీవైడీ సంస్థ ఖండించింది. హైదరాబాద్‌లో ప్లాంట్ ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.తెలంగాణ ప్రభుత్వం బీవైడీతో చర్చలు జరుపుతోందని, తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.దీంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కారుకు చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ బీవైడీ బిగ్ షాక్ ఇచ్చినట్లుగా మారింది.హైదరాబాద్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రకటించింది. బీవైడీ సంస్థ ఇప్పటికే భారత్‌లో తన కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, ఇక్కడ సొంత ఉత్పత్తి యూనిట్ లేదు.ప్రస్తుతం చైనాలో ఉత్పత్తి చేసిన కార్లను దిగుమతి చేసుకోవడం వల్ల అధిక సుంక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా బీవైడీతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్ సమీపంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కాగా..ఈ కథనాలు సంస్థ దృష్టికి వెళ్లటంతో ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కంపెనీ స్పష్టం చేసింది.ప్రపంచంలోనే నెంబర్ వన్ ఈవీ సంస్థ అయిన బీవైడీ హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందని, సుమారు రూ.70 వేల కోట్లతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోందంటూ ప్రచారం జరిగింది.దీన్ని ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రకటించారు. బీవైడీ కంపెనీ పెట్టుబడితో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని కూడా ప్రచారం జరిగింది. అంతేకాకుండా..ఈ కంపెనీ హైదరాబాద్‌కు వస్తే దేశీయ ఈవీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పుకొచ్చారు. కాగా..ఈ వార్తలను బీవైడీ కంపెనీ పూర్తిగా ఖండించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.