Take a fresh look at your lifestyle.

తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ

  • ఈ దారుణాలు రాహుల్​ కు కనిపించడం లేదా..
  • హెచ్ సీయూ భూముల్లో విధ్వంసం జరుగుతుంది.
  • ప్రజా హక్కులను కూడా కాంగ్రెస్​ అడ్డుకుంటుంది.
  • నోరులేని జీవాలపైకి కూడా బుల్డోజర్లు దూసుకువస్తున్నాయి.
  • మాజీ మంత్రి కేటీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.హెచ్ సీయూ భూముల్లో  రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం  చేస్తోందని ఆరోపించారు.చివరకు ప్రజా హక్కులను కూడా కాంగ్రెస్​ అడ్డుకుంటుందని మండిపడ్డారు. నోరులేని జీవాలపైకి కూడా బుల్డోజర్లు దూసుకువస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ అరాచకాలు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల్లో జరుగుతున్న విధ్వంసానికి వ్యతిరేకంగా, యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా కేటీఆర్ వెలుతారన్న ప్రచారం సాగడంతో పోలీసులు ఆయన ఇంటి చూట్టూ మొహరించారు.దాదాపుగా ఆయనను హౌస్ అరెస్టు చేసినంత పని చేశారు.  తన ఇంటి ముందు పోలీసుల బలగాన్ని చూసి కేటీఆర్ అవాక్కు అవుతూ..ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకపడ్డారు.ప్రజా హక్కులను హరిస్తూ, గళాన్ని వినిపించకుండా  కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు.యూనివర్సిటీలో ఎలాంటి సమస్య లేకపోతే ఎందుకు ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని ప్రశ్నించారు.
  •  రాహుల్ గాంధీ వస్తే మేం ఇలా చేయలేదు..
గతంలో రాహుల్ గాంధీ దరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే..ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పించినట్లు కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నెలలో ఒకసారి కాదు రెండుసార్లు హెచ్ సియూ కి రాహుల్ గాంధీ వచ్చారన్నారు.ఆయన వచ్చిన ప్రతిసారి అక్కడ అన్ని రకాల భద్రత, రక్షణ కల్పించామని తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేములకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన సైతం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని..మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరకు ప్రతిపక్ష నేతలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. మమ్మల్ని బయటకు వెళ్లకుండా, హెచ్‌సీయూకు చేరకుండా అడ్డుకోవడానికి పోలీసుల గస్తీ ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.ఈ కపట నాటకం ఎందుకు రాహుల్? అని  ప్రశ్నించారు.ఈ నాటకాలు అవసరామా అని నిలదీశారు. హైడ్రా, మూసీ పేరుతో ప్రజల ఇండ్లు – హెచ్‌సీయూలో పక్షుల గూళ్లు ఇలా ఏదీ కాంగ్రెస్ ప్రభుత్వం వదలడం లేదన్నారు.నోరున్న జనంపైకి బుల్డోజర్ – నోరు లేని మూగజీవాల మీదకు బుల్డోజర్ దూసుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. మూసీలో, హైడ్రాలో మూటల వేట – ఆఖరికి హెచ్‌సీయూలోనూ కాసుల వేట మొదలుపెట్టారని మండిపడ్డారు.పంటలు ఎండుతున్నాయి నీళ్లు లేవంటూ రైతుల గోస పడుతుంటే.. ఇక్కడ అర్ధరాత్రి బుల్డోజర్ దెబ్బలకు వన్యప్రాణాల హాహాకారాలు చేస్తున్నాయన్నారు. చదువులు చెప్పే చోట విధ్వంసం దారుణమన్నారు

Leave A Reply

Your email address will not be published.