ముద్ర,వీపనగండ్ల : శివ దీక్షను ఆచరించిన శివ స్వాములు మహాశివరాత్రి ని పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్నకు ఇరుముడిని సమర్పించడానికి శివ దీక్ష చేపట్టిన భక్తులు మండల పరిధిలోని కల్వరాలనుంచి సోమవారం బయలుదేరి వెళ్లారు.శివ స్వాములు మండలం రోజులు ఉపవాస దీక్షతో శివమాలను ధరించి స్థానిక శివాలయంలో ఇరుముడి ధారణ చేశారు. మొదటగా శివాలయంలో శివ స్వాములు భక్తిశ్రద్ధలతో శివలింగానికి పంచామృతాభిషేకం నిర్వహించారు.శివ స్వాములు గోత్రనామాలతో పూజలు నిర్వహించి ఇరుముడి బస్తాలో మల్లికార్జున స్వామి కి సంబంధించిన పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, విభూతి, కర్పూరం, టెంకాయలు, బియ్యం, బిల్వదళాలు తో పూజలు నిర్వహించి ఇరుముడి పూజా కార్యక్రమాన్ని గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. పాదయాత్రగా బయలుదేరుతున్న శివ స్వాములకు నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ, కుటుంబ సభ్యులు గ్రామస్తులు భాజా భజంత్రీలు భజన కార్యక్రమాలు కోలాటాల మధ్య వీడుకోలు పలికారు.