ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: ఆరు బయట చెత్త పడవేసిన దుకాణదారులకు జరిమానా విధించారు రామగుండం నగర పాలక సంస్థ అధికారులు. గురువారం ఫైవ్ ఇంక్ లైన్ చౌరస్తా వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఊడ్చి వెళ్ళిన తరువాత చెత్త బయట పడవేయడం గుర్తించి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ జె.అరుణ శ్రీ ఆదేశాల మేరకు ఆరుగురు షాపు యజమానులకు ఒక్కొక్కరికీ రూ 500/-చొప్పున జరిమానా విధించామని సానిటరీ ఇన్స్పెక్టర్ నాగ భూషణం తెలిపారు. చెత్త ను బయట పడవేయకుండా తడి చెత్త పొడి చెత్త గా వేరు చేసి వేర్వేరు డబ్బాలలో వేసి మున్సిపల్ వాహనాలకు అందించి సహకరించాలని ఆయన కోరారు.కాగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం పవర్ హౌజ్ కాలనీలో పిచ్చి చెట్లు,పొదలు తొలగించారు.రఘుపతిరావు నగర్ లో వాల్ పెయిoటింగ్స్ వేశారు.గాంధీ నగర్ లో శిధిలా వస్థలో ఉన్న కట్టడాల ను రామగుండం నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం ఆద్వర్యంలో తొలగించారు. మరికొన్నిటికీ ఖాళీ చేయాలని హెచ్చరిక నోటీసులు అంటించారు.రెవెన్యూ విభాగం ఆద్వర్యంలో నూతనoగా నిర్మించిన ఇళ్లను గుర్తించి కొలతలు నమోదు చేసుకున్నారు. వేర్వేరుగా నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో టి పి ఓ నవీన్, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ రావు, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్, జవాన్లు సుగుణాకర్, యూసఫ్, ఆడెపు శ్రీనివాస్,మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
