తుంగతుర్తి, ముద్ర: రాష్ట్రంలో గిరిజన హక్కులను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రాజారామ్ అన్నారు. గురువారం తుంగతుర్తి పద్మశాలి భవన్ లో జరిగిన తెలంగాణ గిరిజన సమాఖ్య తుంగతుర్తి నియోజకవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సబ్ ప్లాన్ నిధులను దారి మల్లించి గిరిజనులకు రావాల్సిన వాటాను కొల్లగొడుతున్నారని అన్నారు. అదేవిధంగా తండాలను గ్రామపంచాయతీలుగా చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించడంలో వివక్ష చూపిస్తున్నారని అన్నారు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనిమరియు గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ పోస్టులను తక్షణమే భర్తీ చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు.గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని ఆయన అన్నారు గిరిజన నాయకులు గుగులోత్ నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు బి ప్రతాప్ నాయకులు నరేష్ గూగులోత్ నరేష్ ఇస్లావత్ భాస్కర్ జాటోత్ పవన్ సురేందర్ శీను తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గిరిజన సమాఖ్య నూతన కమిటీ ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా గుగులోత్ నరేష్ ఉపాధ్యక్షులుగా బి సతీష్ భానోత్ ప్రతాప్ ప్రధాన కార్యదర్శిగా ఇస్లావత్ మనోజ్ సహయ కార్యదర్శులుగా గుగులోతు నరేష్ భాస్కర్ కోశాధికారిగా జాటోత్ పవన్ కార్యవర్గ సభ్యులుగా ఇస్లావత్ రాజు సురేందర్ వెంకన్న శంకర్ తదితరులను సమావేశం లో ఏకగ్రీవ ఎన్నుకున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రాజా రామ్ తెలియజేశారు.
.