కోరుట్ల, ముద్ర విలేఖరి: స్వాతంత్ర సమరయోధులు సుఖ్ దేవ్ తాపర్ 118 వ జయంతిని పురస్కరించుకొని గురువారం రోజు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో యువజన సంఘాలు, బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుఖ్ దేవ్ భగత్ సింగ్, రాజ్ గురు లతో కలిసి బ్రిటీష్ సామ్రాజ్యంపై భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాసోజి ప్రశాంత్, గాంధారి శ్రీనివాస్, కాసోజి ప్రతాప్, దొమ్మటి అశోక్, ఓజ్జల గణేష్,,అల్లె భాను, తదితరులు పాల్గొన్నారు.