Take a fresh look at your lifestyle.

ప్రమాద భీమా చెక్కు అందజేత

కోరుట్ల, ముద్ర విలేకరి: గాయత్రి బ్యాంకు ఖాతాదారులైన శివరాత్రి సాగర్ ప్రమాదవ శాత్తు మరణించగా మృతుడికి ది గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో నిర్భయ సేవింగ్ ఖాతా పై గల ప్రమాద భీమా సౌకర్యం ద్వారా ఒక లక్ష రూపాయల చెక్కును కోరుట్ల ఇంచార్జ్ తహసీల్దార్ ఎం.డీ. ఫారూక్, బ్రాంచి మేనేజర్ పి, రోహిత్ చేతుల మీదుగా మృతుని తల్లి శివరాత్రి లక్ష్మి కి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాతాదారులకు కనీస డిపాజిట్ లతోనే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ, పేద, మధ్య తరగతి వినియోగదారులకు ప్రమాద భీమా కల్పిస్తూ, ప్రజల నగదు అవసరాలను తీరుస్తుందని, బ్యాంకింగ్ కరెస్పాండెంట్ నియమించి బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.