వికారాబాద్, ముద్ర విలేకరి : వికారాబాద్ జిల్లాలో అంగవైకల్యం ఉన్నవారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు.సదరం క్యాంపులో పాల్గొనుటకు ముందుగా స్లాట్ తప్పనిసరి బుక్ చేసుకోవాలని సూచించారు.బుక్ చేసుకున్న స్లాట్ మెసేజ్ ప్రకారం సకాలంలో క్యాంపుకు హాజరు కావాలని తెలిపారు. జిల్లాలో సదరం/యుడి ఐడి ద్వారా అంగవైకల్యం ఉన్నవారికి మే నెలలో వికారాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారని తెలిపారు. ఈనెల 13, 16, 21వ తేదీలలో అంగవైకల్యం ఉన్నవారికి 23న చెవుడు 27న మూగవారికి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.