Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : కొలిశెట్టి యాదగిరిరావు

 

ముద్ర ….తుంగతుర్తి….
దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు మరియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుపట్టారు, ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బడా పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదను అప్పజెప్పి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలపై అనేక భారాలను మోపుతున్నదని విమర్శించారు, అనేక సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల బ్రతుకులను ఆగం చేసిన చరిత్ర బిజెపి ప్రభుత్వానికి అని అన్నారు, అదేవిధంగా విద్యుత్ సంస్కరణల పేరుతో రైతాంగానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తుందని నూతన విత్తనం ఒప్పందాలను తీసుకొచ్చి రైతు నోట్లో మట్టి కొట్టిందని అన్నారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని తొలగించి జివి రామంజి అనే పేరుతోటి ఉపాధి పథకం తీసుకొచ్చి పేదల పొట్ట కొట్టిందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి దేశంలో యువకులకు ఉపాధి ఉద్యోగం లేక నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన పెద్ద పెద్ద పరిశ్రమలను బ్యాంకులను ఇన్సూరెన్స్లను రైల్వే లను చివరికి రక్షణ రంగాలను కూడా ప్రైవేట్ పనులు చేసి దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని విచారణ వ్యక్తం చేశారు, నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచడం ద్వారా అసంఘటితరంగా కార్మికులు కూడు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే కార్మిక సంఘాలు మేధావులు ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఐక్యంతో పోరాటాలు కొనసాగుతాయి అని అన్నారు, ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వం కనువిప్పు కలిగే విధంగా దేశవ్యాప్తంగా విజయవంతమైందని వారన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మరియు ఏఐటీయూసీ జిల్లా నాయకులు బుర్ర శ్రీనివాస్ రాజారాం, బొంకూరు శ్యాంసుందర్, కోట రామస్వామి, అంగన్వాడీ వర్కర్స్ తుంగతుర్తి ప్రాజెక్టు గౌరవాధ్యక్షురాలు ఖమ్మం పాటీ ధనలక్ష్మి, స్వరూప, మంగమ్మ, మంజుల, మాజీ జెడ్పిటిసి తాటి విజయమ్మ, పళ్ళ సుదర్శన్, గడ్డం ఎల్లయ్య ,జాజుగాల్ల ముత్తయ్య, ఉప్పుల సోమయ్య, యాదగిరి, బోనాల వెంకన్న, రామచంద్రు, మరియు గ్రామపంచాయతీ వర్కర్స్ అమాలి సంఘం నాయకులు బిల్లింగ్ వర్కర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.