Take a fresh look at your lifestyle.

చెట్టును ఢీకొట్టిన కారు,….బీసీవై జిల్లా అధ్యక్షులు మృతి

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడగా భారత యువజన చైతన్య (బీసీవై) మెదక్ జిల్లా అధ్యక్షులు, ప్రముఖ బట్టల వ్యాపారి మృతి చెందిన సంఘటన
కొల్చారం సమీపంలో తెల్లవారు జామున చోటు చేసుకుంది. తెల్లవారుజామున గాఢ నిద్ర, అతివేగంతో చెట్టును ఢీ కొట్టడంతో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మెదక్ పట్టణానికి చెందిన భారత యువజన చైతన్య పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు, వీవీ సిల్మ్స్ బట్టల షాపు యజమాని వనపర్తి రోహిత్ గుప్తా (47) తో ప్రమాదం జరిగిన వెంటనే మృతి చెందగా కామారెడ్డి జిల్లా కు మరో నాయకుడు విజయ్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. వీరు విజయవాడకు వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కుల్చారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలున్నారు.
మెదక్ పట్టణంలో విషాదం
రోహిత్ మరణ వార్త మెదక్ పట్టణంలో విషాదం అలుముకుంది. రోహిత్ వ్యాపారీగా అందరితో కలివిడిగా ఉండేవాడు. మరణ వార్త తెలుసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడికి భార్య, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయంత్రం అశ్రు నాయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ రావు, పద్మ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, కౌన్సిలర్లు శివ రామకృష్ణ, బట్టి ఉదయ్ కుమార్, ఆంజనేయులు, మన్సూర్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, ఆర్కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.