Take a fresh look at your lifestyle.

మహనీయుల జయంతి జ్ఞాన పాదయాత్ర

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ పొలిటికల్ యువజన సమితి ఆధ్వర్యంలో మహనీయుల జ్ఞాన పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు తంగళ్ళపల్లి గిరిధరాచారి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు భాస్కరరావు, వెంకారెడ్డి చేతుల మీదుగా పాదయాత్ర కరపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన ఉద్యమ కెరటం శ్రీకాంత చారి స్వస్థలం పొడిచేడు గ్రామం నుండి 22 గ్రామాల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం వరకు భువనగిరిలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ముగుస్తుందన్నారు. సుమారు 72కిలో కిలోమీటర్ల ,మహా జ్ఞాన పాదయాత్ర చేపడుతున్న కార్యక్రమానికి అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఏప్రిల్ 10, 11 ,12 ,13 ,14 తేదీలలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు నమోజ్ రాజు చారి, బూడిద ప్రశాంత్, కొంగరీ మహేష్, తొర్రి సురేష్ ,మహంకాళి సురేష్ చారి, పడిగం శ్రీనివాస్, కొంచెం రాజు బూడిద నాగరాజు, కానుగంటి ప్రేమ్ కుమార్, మరియు బుగ్గ శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్, వెంకటేష్, నరసింహ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.