ముద్ర, బాన్సువాడ: బుధవారం నాడు దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయికి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని, హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, రాష్ట్రంలో లేబర్ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు మరియు బాన్సువాడ డివిజన్ ఏఐటీయూసీ కార్యదర్శి డి శంకర్ మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీలు, మధ్యాహ్న భోజన కార్మికులు, హాస్పటల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు కార్మికులు ఐక్యంగా ఉండాలని వారు తెలిపారు. బాన్సువాడ హాస్పిటల్ కార్మికులకు మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త సాయిలు, భూమయ్య, కమ్మరి రాములు, టి.శ్రీనివాస్, సర్దార్, పి శ్రీనివాస్, గంపల సాయిలు, వల్లెపు గంగాధర్ హాస్పిటల్. కార్మికులు రేణుక, కళ్యాణి, సురేఖ, రజియా బేగం, సుశీల తదితరులు పాల్గొన్నారు.