ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఫిబ్రవరి 25న గైనకాలజిస్ట్ పోస్టులకు భర్తీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహణ జరుగుతుందని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.పెద్దపల్లి జిల్లాలో గల తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న 2 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (గైనకాలజిస్ట్) , కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 25న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని అన్నారు.ఆసక్తి గల వైద్యులు తమ యొక్క దరఖాస్తు బయోడేటా తో పాటు అన్ని విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్ల తో పాటు జిరాక్స్ ప్రతులు ఒక సెట్ తో హాజరు కావాలని,సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు (గైనకాలజిస్ట్) కు నెలకు లక్ష రూపాయల వేతనం ఉంటుందని,ఇతర వివరాలకు 8499061999 నెంబర్ నందు సంప్రదించాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.