ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తిలో 6వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివిన తనకు సొంత అక్కల ప్రేమ ఆప్యాయత చూపిన పార్వతమ్మ కుటుంబాన్ని ముఖ్యమంత్రి హోదాలో కలిసి పరామర్శించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం వనపర్తి పట్టణానికి పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చిన తాను ముఖ్యమంత్రి హోదాలో తన అక్క అయిన పార్వతమ్మ ఇంటికి రావడం పట్ల పార్వతమ్మ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని ఆప్యాయంగా సాధారంగా ఆహ్వానించారు.గతంలో వనపర్తి పట్టణంలోని పార్వతమ్మ గృహంలో అద్దెకు ఉండి ఇంటర్ వరకు చదివిన పాత జ్ఞాపకాలను ముఖ్యమంత్రి గుర్తు తెచ్చుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పార్వతమ్మ కుటుంబ సభ్యులను ఆప్యాయతగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన ఇంటికి తన తమ్ముడు రావడం పట్ల పార్వతమ్మ ఆనందభాష్పాలతో స్వాగతం పలికింది.ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు,దామోదర రాజనర్సింహ,ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి,ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి మధుసూదన్ రెడ్డి, నాయకులు ఒబేదుల్లా కొత్వల్,సాయి చరణ్ రెడ్డి,శివసేనారెడ్డి, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.