ముద్ర, వనపర్తి : వనపర్తి లోని 220/ 132/ 33 కె.వి ఉపకేంద్రమును తెలంగాణ ట్రాన్స్కో డైరెక్టర్ జగత్ రెడ్డి తనిఖీ చేశారు. 2×160 MVA పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ కావడం వల్ల నిర్మాణంలో ఉన్నటువంటి మూడవ 160 ఎం వి ఏ పనులను పర్యవేక్షించారు. రానున్న రోజుల్లో పెరిగే విద్యుత్ అవసరాలను తీర్చడానికి నిరంతరాయంగా వ్యవసాయ.గృహ,వ్యాపార మరియు పరిశ్రమల వినియోగదారులకు విద్యుత్తు అందించాలని క్రింది స్థాయి అధికారులను త్వరితగతిన పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.అదేవిధంగా జడ్చర్ల నుండి తిమ్మాజిపేట వరకు నిర్మాణంలో ఉన్నటువంటి 132 కెవి లైనును కూడా పర్యవేక్షించి త్వరితగతిన పూర్తిచేయాలని క్రింది స్థాయి అధికారులకు వివరించారు.కార్యక్రమంలో విద్యుత్ మహబూబ్నగర్ ఎస్సీ ఓఎంసీ వాసుదేవరావు,కన్స్ట్రక్షన్ ఈఈ ప్రకాష్,డి ఈ సైదయ్య తదితరులు ఉన్నారు.