Take a fresh look at your lifestyle.

భూదాన్ భూములపై హైకోర్టుకు ఐపీఎస్ లు

  • కోర్టులో అప్పీలు చేసిన మహేశ్ భగవత్, స్వాతిలక్రా, సౌమ్యామిశ్రా.
  • ఇప్పటికే 27 మంది ఉన్నతాధికారుల భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు.
  • నిషేదిత జాబితాలో పెట్టాలని ఆదేశం.
  • అప్పీలుకు సిద్ధమవుతోన్న ఇంకొందరు అధికారులు.

ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన. సంచలనంగా మారిన భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. అక్రమంగా భూములు కాజేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కీలక ఐపీఎస్ అధికారులు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.27 మంది ఉన్నతాధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చింది.ఈ తీర్పుపై మహేశ్ భగవత్, స్వాతిలక్రా, సౌమ్యామిశ్రాలు మంగళవారం హైకోర్టులో అప్పీలు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇంకెంత మంది కోర్టులో అప్పీలు చేసుకుంటారోననే ఆసక్తి నెలకొన్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలోని 181, 182 సర్వే నెంబర్‌లో సుమారు 103 ఎకరాల భూదాన్ భూమి ఉంది.ఈ భూమిపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఇందులో అక్రమాలు జరిగాయని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.ప్రతివాదులుగా ప్రభుత్వంతో పాటు పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వారి భార్యలు, పిల్లలను ప్రతివాదులుగా చేర్చారు.ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ప్రభుత్వం, సీబీఐ, ఈడీతోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తాజాగా ముగ్గురు ఐపీఎస్‌లు హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ అంశంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు సైతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.