- జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లా కోర్టులో మౌళిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారుజగిత్యాల బార్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు జిల్లా కోర్టును ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కోర్టు కు అవసరమైన మౌలిక సదుపాయాలు, నూతన కోర్టు, కోర్టు హాల్, నూతన పోస్టులు, అడ్వకేట్ ల సమస్యలు తదితర విషయాలపై ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందే మారుతి, ఉప అధ్యక్షుడు మహేందర్, సీనియర్ అడ్వకేట్స్ జనార్దన్ రెడ్డి, బండ భాస్కర్ రెడ్డి, కొలుగురి దామోదర రావు, నరేందర్, మదన్ మోహన్, ఎర్ర నర్సయ్య, లక్ష్మి నారాయణ,న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
