Take a fresh look at your lifestyle.

పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శ్రీకారం

అందొల్ ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి: అందొల్ నియోజకవర్గ పరిధిలో టేక్మాల్ మండలం సిఎం తండా గ్రామపంచాయతీలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిఆర్ దామోదర రాజా నర్సింహాకు విన్నవించగా మంత్రి నిధులు మంజూరు చేశారు. దీనితో
ఆదివారం పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు.
ఈకార్యక్రమంలో టేక్మాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్,మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సుబేదార్ మణికిషన్,గ్రామ సర్పంచ్ దేవులిబాయి,జోగిపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ దానీబాయి లక్ష్మా, మాజీ సర్పంచులు టేక్మాల్ మాజీ సర్పంచ్ ఏ.పాపయ్య, సూరంపల్లి మాజీ సర్పంచ్ బిక్షపతి,సీనియర్ నాయకుడు ఏ.సాగర్,టేక్మాల్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సేవాలాల్ హరిచంద్,తారసింగ్,సిఎం తండా నాయకులు,గ్రామ గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.