మోత్కూర్ ముద్ర న్యూస్ : మండలంలోని పాటిమట్ల, దాచారం గ్రామాలలో సమ భావన సంఘాల కోసం భవనాలు మంజూరయ్యాయని కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు గౌడ్ తెలిపారు. ఆదివారం అయన విలేకరులతో మాట్లాడుతూ సమభావన సంఘాల కోసం భవనాలు నిర్మించేందుకు ఉపాధి హామీ పథకం నుండి ఒక్కో భవనానికి రూ.10 లక్షలు మంజూరి ఆయ్యాయని తెలిపారు. సమ భావన సంఘాలకు భవన నిర్మాణాల కోసం స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ నిధులు మంజూరు చేయించారని తెలిపారు. మోత్కూర్ మండలంలో పాటిమట్ల, దాచారం గ్రామాల్లోని సమ భావన సంఘాల కు భవనాలు మంజూరి య్యాయని తెలిపారు.నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మందుల సామేల్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.