Take a fresh look at your lifestyle.

గ్యాస్ వినియోగంలో క్రమబద్ధీకరణకు విస్తృత చర్యలు ఆల్ ఇండియా ఎల్పీజీ డీలర్ల సంఘం అధ్యక్షులు పి వి రావు

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరా విషయంలో ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని, వినియోగదారులు ఆందోళన అవసరం లేదని అఖిల భారత ఎల్పీజీ డీలర్ల సంఘం అధ్యక్షులు పింగళి వేంకటేశ్వర రావు పేర్కొన్నారు. ఈ మేరకు నిర్మల్ లో ఆయన ‘ముద్ర ప్రతినిధి’ తో మాట్లాడుతూ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం సరఫరాను క్రమబద్ధీకరించేందుకు అమెరికా, నైజీరియా వంటి ఉత్పాదక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుందని పేర్కొన్నారు. అలాగే వాణిజ్య సిలెండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాటిని విడుదల చేస్తే గృహావసరాలకు ఇబ్బంది కలుగుతుందని వాటిపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పథకం కింద 12 కోట్ల కనెక్షన్లు విడుదల చేశారన్నారు. వీటిలో దాదాపు 11.50 కోట్ల మేర వినియోగదారులు వారి 12 సిలిండర్ల ఏడాది కోటాను వినియోగించుకుంటున్నారన్నారు. ఐతే వీటిలో అత్యధికం మార్కెట్ కు తరలుతున్నాయన్న ఆరోపణలున్న కారణంగా వీటిపై కూడా నియంత్రణ విధించినట్లు తెలిపారు. కాగా కొరత భయంతో పలువురు వినియోగదారులు ఖాళీ సిలిండర్లు లేకపోయినా ముందుగానే బుకింగ్ చేసుకుంటున్న కారణంగా డెలివరీ సిబ్బంది వెనక్కి రావాల్సి వస్తోందని వివరించారు. ఫలితంగా వాస్తవంగా అవసరం ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.సిలిండర్ల పంపిణీ కోసం పలు చర్యలను కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ పర్యవేక్షిస్తున్నారన్నారు. సిలిండర్లను అవసరం లేకుండా బుకింగ్ చేయటాన్ని నిరోధించేందుకు పట్టణాల్లో 25, గ్రామాల్లో 45 రోజుల వ్యవధి విధించారని పేర్కొన్నారు. అవసరం మేరకు పొదుపుగా వాడుకుంటే కొరత రాకుండా చూడవచ్చని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.