రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : 100% వైకల్యం కలిగిన దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ కార్యదర్శి ఐఏఎస్ అనిత రామచంద్రన్ కు దివ్యాంగుల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మేడపట్ల సతీష్ బుధవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. హైదరాబాదులో ఆమెను కలిసి దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై క్లుప్తంగా వివరించారు. దివ్యాంగులకు పది,ఆరు వేల రూపాయల పెన్షన్ అందించాలని కోరారు.