- ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: సారా తయారీ చేస్తే వారిపై చట్టప్రకారం కట్టిన చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దండ మండలం దొంగల గుట్ట తండా, జెపల్లి, పోచమ్మ గడ్డ తండాలో సారా తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వంగూరు మండలం సోమ్లాతండ నుంచి కోనేటిపురం కు సారా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని నుండి 14 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటరెడ్డి తెలిపారు. ఎక్కడైనా సారా తయారీ పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దాడుల్లో సిబ్బంది రఘు, మహేష్, నార్య, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.