- ప్రమాదంలో రెండు ముక్కలైన ద్విచక్ర వాహనం…
కోరుట్ల, ముద్ర:- కారు, ద్విచక్ర వాహనం డీ కోని వ్యక్తి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామ శివారులో శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల నుండి జగిత్యాల వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారున్ని జగిత్యాల నుండి కోరుట్ల వైపు వస్తున్న ఓ కారు ఎదురుదుగా డీ కొట్టడంతో ద్విచక్ర వాహనం రెండు ముక్కలు కాగా ఈ ఘటన చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే చనిపోగా కారు లో వస్తుండగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో ముగ్గురికి తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు కోరుట్ల పట్టణానికి చెందిందని భావిస్తున్నారు. మరణించిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా వాసిగా తెలుస్తోంది. విషయం తెలిసిన కోరుట్ల ఎస్సై శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.